భగ్గుమన్న రైతన్నలు.. ధాన్యంతో తొగుట మార్కెట్ ముందు రాస్తారోకో
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారని, కొద్ది రోజుల్లో వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైతే.. ధాన్యం పోయడానికి కూడా స్థలం లేదన్నారు సొసైటీ చైర్మన్ కే హరికృష్ణా రెడ్డి.
వరంగల్ వాయిస్, తొగుట : ఆరుగాలం కష్టించి పండించిన పంటను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సిగ్గు చేటని సొసైటీ చైర్మన్ కే హరికృష్ణా రెడ్డి మండిపడ్డారు. మండల కేంద్రమైన తొగుట వ్యవసాయ మార్కెట్‌లో పొద్దు తిరుగుడు ధాన్యం కొనుగోళ్లు గత 15 రోజులుగా నిలిచిపోవడంతో రైతులతో కలిసి పొద్దు తిరుగుడు ధాన్యాన్ని పరిశీలించారు.
15 రోజులుగా ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఆగ్రహానికి లోనయ్యారు. పొద్దు తిరుగుడు ధాన్యంతో మార్కెట్ ముందు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా సొసైటీ చైర్మన్ కే హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కోడ్‌లో గత నెల 3న తొగుటలో పొద్దుతిరుగుడు కేంద్రాన్ని ప్రారంభ...