EX MLA Anjaiah yadav | వరంగల్ రజతోత్సవ సభను సక్సెస్ చేయాలని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పిలుపు
తెలంగాణ ప్రజలు గర్వపడేలా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, ప్రజల మన్ననలను పొందిన ప్రభుత్వం కేసీఆర్‌ది అని మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ గుర్తు చేశారు. ఇవాళ షాద్ నగర్ పట్టణంలోని హైదరాబాద్ రోడ్ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభ వాల్ రైటింగ్ వేశారు.
వరంగల్ వాయిస్, షాద్ నగర్ : తెలంగాణ ప్రజల కలను నెరవేర్చడంతోపాటు రాష్ట్ర అభివృద్ధిని కనులారా చూపించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కిందని, స్వరాష్ట్రాన్ని సాధించి దేశంలోనే నెంబర్ 1 అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దింది బీఆర్ఎస్ పాలన అని మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ అన్నారు. ఇవాళ షాద్ నగర్ పట్టణంలోని హైదరాబాద్ రోడ్ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభ వాల్ రైటింగ్ వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు గర్వపడేలా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, ప్రజల మన్ననలను పొందిన ప్రభుత్వం కేసీఆర్‌ది అని గుర్తు చేశారు. రైత...