Sabitha Indra Reddy | ఒక్క హామీ కూడా నెరవేర్చని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సబితా ఇంద్రారెడ్డి సెటైర్లు
మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 15 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను సోమవారం అందజేశారు.
వరంగల్ వాయిస్, బడంపేట : ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 15 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను సోమవారం అందజేశారు.
ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కల్యాణ లక్ష్మీ డబ్బులు వస్తాయనే ఆశతో అప్పు చేసి ఆడపిల్ల పెళ్లి చేస్తున్నారని అన్నారు. సకాలంలో చెక్కులు అందజేయకపోవడంతో తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారని ఆందోళన వ్యక్తం...