Niranjan Reddy | వ్యవసాయ రంగం, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధ్యత లేదు, బాధ లేదు : నిరంజన్ రెడ్డి
వ్యవసాయ రంగం, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధ్యత లేదు, బాధ లేదు అని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : వ్యవసాయ రంగం, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధ్యత లేదు, బాధ లేదు అని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిరంజన్ రెడ్డి మాట్లాడారు.
ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతు ఏ కారణం చేత మరణించినా రూ.5 లక్షల పరిహారం అందించే పథకం రైతు బీమా.. రైతు చనిపోయిన ఏడు పని దినాలలో రైతు కుటుంబానికి పరిహారం అందేది. ప్రపంచంలోనే అత్యుత్తమ పథకాలలో ఒకటి రైతు బీమా, రైతుబంధు అని యూఎన్ఓకు చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సంస్థ ప్రకటించింది. రైతు బీమా పథకం ప్రవేశపెట్టిన తరువాత డిసెంబర్ 4, 2023 బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే వరకు రాష్ట్రంలో 1,18,197 మం...