Harish Rao | సంస్కారానికి ఆస్కార్ అవార్డు ఉంటే అది రేవంత్ రెడ్డికే ఇవ్వాలి : హరీశ్ రావు
Harish Rao | సంస్కారానికి ఆస్కార్ అవార్డు ఉంటే అది రేవంత్ రెడ్డికే ఇవ్వాలి అని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలు చేశారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : సంస్కారానికి ఆస్కార్ అవార్డు ఉంటే అది రేవంత్ రెడ్డికే ఇవ్వాలి అని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలు చేశారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు.
రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క కలిసి నిర్మించిన గాలి మేడ ఈ బడ్జెట్. ఎన్నికల ముందు పాతాళ భైరవి… నరుడా ఏమి నీ కోరిక..?
ఎన్నికల తర్వాత… పాపాల భైరవి. నన్నేం అడుగకు, నాకేం తెల్వది. డిసెంబరు 9, 2023 వరకు అమలు చేస్తామన్న వాగ్దానాలు అమలుకావడానికి ప్రజలు ఇంకా ఎన్ని డిసెంబర్లు ఎదురు చూడాలో. రావాల్సిన డిసెంబరు అసలు వస్తుందో రాదో అనే అనుమానాలు ముసురుకున్నాయి. ఊకదంపుడు ఉపన్యాసాలు, ఉత్తర కుమార ప్రగల్బాలు. వ్యక్తిగత దూషణలతో మార్చురీ కంపు కొడుతున్నసీఎం హేయమైన ప్రసంగాలను వినలేక జ...