Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని చూసి ఊసరవెల్లి సైతం ఉరేసుకునే పరిస్థితి : హరీశ్‌రావు
Harish Rao | ప్రతీ అంశం లో ప్లేటు ఫిరాయిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూముల అమ్మకంపై కూడా తన నాలుకను మడత పెట్టి నిస్సిగ్గుగా నిధుల సమీకరణ కోసం వేలాల బాట పట్టిండు అని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : ప్రతీ అంశం లో ప్లేటు ఫిరాయిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూముల అమ్మకంపై కూడా తన నాలుకను మడత పెట్టి నిస్సిగ్గుగా నిధుల సమీకరణ కోసం వేలాల బాట పట్టిండు అని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. భూముల వేలంపై మారిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని చూసి ఊసరవెల్లి సైతం ఉరి వేసుకునే పరిస్థితి నెలకొన్నది అని విమర్శించారు.
‘‘ప్రభుత్వ భూములంటే పెద్దలిచ్చిన ఆస్తి అని, తెలంగాణ జాతి సంపద అని, ఆ భూములను అమ్మితే భవిష్యత్తులో స్మశానాలు నిర్మించాలంటే కూడా భూమి లేకుండా పోతుందని’’ నాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి మొసలి కన్నీరు కార్చిండు. తాము అధిక...