Harish Rao | కొల్లాపూర్‌లో బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ గూండాల దాడి దుర్మార్గం : హరీష్ రావు
Harish Rao | ఏడాది కిందటి వరకు శాంతియుతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హింస, నేరాలు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : ఏడాది కిందటి వరకు శాంతియుతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హింస, నేరాలు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని నార్యనాయక్ తండాలో తాజాగా బీఆర్ఎస్ కేడర్‌పై జరిగిన దాడే దీనికి నిదర్శనమని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుందని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులను ఉసిగొల్పుతూ నిజంగానే మార్పు తెచ్చారు. కాంగ్రెస్ మార్క్ ఎమర్జెన్సీని ఆ పార్టీ కొల్లాపూర్‌లో అమలు చేయిస్తోంది. సాతాపూర్‌లో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై దాడి జరిగి ఒక రోజు గడవక ముందే నార్యానాయక్ తండాలో కాంగ్రెస్ గూండాలు రెచ్...