Harish Rao | నమ్మినందుకు రైతుల గొంతు కోస్తారా..? రేవంత్‌ను సూటిగా ప్రశ్నించిన హరీశ్ రావు
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజర గ్రామానికి చెందిన రైతు దంపతులు బొల్లం రామయ్య, చంద్రకళ ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతున్నది అని మాజీ మంత్రి, సిద్దిపేట హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మి ఓటేసినందుకు.. రైతుల గొంతు కోస్తున్న.. కాంగ్రెస్ సర్కారు దుర్మార్గ వైఖరిని యావత్ తెలంగాణ గమనిస్తున్నది అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
మొద్దు నిద్రలో ఉన్న కాంగ్రెస్ పాలకులారా రైతన్న గోస ఇకనైనా పట్టించుకోండి. వారి కన్నీటి కష్టాలు తీర్చండి. అకాల వర్షాలు, సాగు నీటి గోస, కరెంట్ కష్టాలను ఎదుర్కొని కౌలుకు తీసుకున్న 18 ఎకరాల్లో వరి సాగు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వ రూపంలో విపత్తు రైతన్నను నట్టేట ముంచింది. కొండంత సంబురంతో పంటను కొనుగోలు కేంద్రానికి తరలించి 20 రోజులు గడిచినా ప్రభుత్వం పంట కొనుగోలు చేయలేదు. దీంతో అకాల వర్షం ఆ రైతన్నను నిండా ముంచింది. కష్టపడి పండించిన ధాన్యమంతా...