Harish Rao | ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు కళ్లు తెరవాలి.. లేదంటే చరిత్ర క్షమించదు : హరీశ్‌రావు
Harish Rao | కాళేశ్వరం తెలంగాణ వరప్రదాయిని అని.. కాళేశ్వరం కుంగింది అన్నవారికి, ఈ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు.
వరంగల్ వాయిస్, సిద్దిపేట : కాళేశ్వరం తెలంగాణ వరప్రదాయిని అని.. కాళేశ్వరం కుంగింది అన్నవారికి, ఈ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కండ్లు తెరవండి.. లేదంటే చరిత్ర మిమ్ములను క్షమించదు అని హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరు మండలం చంద్లపూర్‌లోని రంగనాయక సాగర్ ప్రాజెక్టును హరీష్ రావు సందర్శించారు.
ఈ సందర్బంగా హరీష్ రావు గారు మాట్లాడుతూ.. రంగనాయక సాగర్‌లోకి కాలేశ్వరం పంప్ హౌస్‌ల ద్వారా నీటిని విడుదల చేసినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు. సిద్దిపేట నియోజకవర్గంలో 50 వేల ఎకరాల్లో పంట సాగు అవుత...