Harish Rao | మహిళలు కోటీశ్వరులు కాదు.. అప్పులపాలయ్యే పరిస్థితి వచ్చింది.. కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Harish Rao | అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పి కోతలు కోసిన రేవంత్ రెడ్డి.. ఏడాదిన్నర పాలనలో మహిళలను చేసింది ఎడతెగని వంచనే అని పేర్కొన్నారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పి కోతలు కోసిన రేవంత్ రెడ్డి.. ఏడాదిన్నర పాలనలో మహిళలను చేసింది ఎడతెగని వంచనే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో మహిళలు కోటీశ్వరులు కాదు.. అప్పులపాలయ్యే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు.
ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు మిగిలింది ఎడతెగని వేదనే. మహిళలను కోటీశ్వరులను కాదు, కనీసం లక్షాదికారులుగా చెయ్యని చేతగాని సర్కారు మీది అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఏడ...