Harish Rao | ఏపీ జల దోపిడీపై రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర వీడాలి : హరీశ్‌రావు
Harish Rao | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జల దోపిడీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర వీడాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జల దోపిడీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర వీడాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు. బనకచర్ల ద్వారా 200 టీఏంసీల కృష్ణా నీళ్ల తరలింపు కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర చేస్తుంటే రేవంత్ రెడ్డి ఎందుకు మౌనం వహిస్తున్నారని హరీశ్‌రావు ప్రశ్నించారు.
బనకచర్ల ద్వారా గోదావరి వరద జలాలనే తీసుకువెళ్తున్నాం, తెలంగాణకు నష్టం లేదు అని ఏపీ నీళ్ల మంత్రి అంటే నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ మౌనం వహించడం వెనుక అంతర్యమేంటని ప్రశ్నించారు. మూడు నెలలుగా నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి రోజుకు 10వేల క్యూసెక్కులను ఏపీ తరలించుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉ...