Harish Rao | నిరుద్యోగుల ఆశల మీద ‘భట్టి’ బకెట్ల కొద్ది నీళ్లు చల్లారు.. మండిపడ్డ హరీశ్‌రావు
Harish Rao | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీలు గుప్పించిన రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కపై మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీలు గుప్పించిన రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కపై మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది.. ఎక్కడ 2 లక్షల ఉద్యోగాలు అని హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు.
భట్టి విక్రమార్క బడ్జెట్ నిరుద్యోగులు ఎన్నో ఆశలు వమ్ము చేసింది. మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నరు మొండి చెయ్యి చూపారు. ఈ ఏడాదైనా ఇవ్వకపోతారా అని ఎదురు చూ...