కూల్‌రూఫ్ పాలసీతో తగ్గనున్న విద్యుత్ ఛార్జీలు
భవనాలకు కూల్‌రూఫ్‌తో మంచి ప్రయోజనాలు
ప్రజల్లో విస్తృతంతగా ప్రచారం చేయాలి
కూల్‌రూఫ్ పాలసీ విడుదల సందర్భంగా కెటిఆర్
వరంగల్ వాయిస్,హైదరాబాద్: దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కూల్ రూఫ్ పాలసీని తీసుకొస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇది భవిష్యత్ తరాలకు ఉపయోగపడే కార్యక్రమమని చెప్పారు. ఇంటితోపాటు, గోడలను కూల్‌రూఫ్ ఉంచుకుంటే విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుందన్నారు. మొదట తమ ఇంటిపై కూల్ రూఫ్ విధానం అమలుచేశామన్నారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ సీడీఎంఏ ఆఫీస్‌లో కూల్‌రూఫ్ విధానంపై ఆయన మాట్లాడారు. భవన యజమానులు ఎండవేడిమిని తగ్గించుకొనేందుకు సహజ విధానాలు పాటించేలా రూపొందించిన తెలంగాణ కూల్‌రూఫ్ పాలసీ 2023`28ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశం మొత్తంలోనే హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ ఉందని చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలు దేశంలో ఎక్కడా లేవని స్పష్టం చేశారు. ...