ACB Raid | రూ.30వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విద్యుత్ ఏవో
విద్యుత్ లైన్ మార్పిడి కోసం బాధితుడి నుంచి లంచం తీసుకున్న విద్యుత్ శాఖ ఏవో ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : విద్యుత్ లైన్ మార్పిడి కోసం బాధితుడి నుంచి లంచం తీసుకున్న విద్యుత్ శాఖ ఏవో ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. హైదరాబాద్‌లోని జీడిమెట్ల డివిజన్‌లో ఏవోగా పనిచేస్తున్న ఎస్.సురేందర్ రెడ్డి గురువారం మధ్యాహ్నం తన కార్యాలయంలో బాధితుడి నుంచి రూ. 30వేలు తీసుకుంటుండగా పట్టుబడ్డారు.
తన ఇంటిపై నుంచి వెళ్తున్న 11 కేవీ లైన్ కేబుళ్లను తొలగించాలని బాధితుడు ఏవోని సంప్రదించగా అందుకు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ( ACB) అధికారులను ఆశ్రయించాడు. గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు కార్యాలయంలో లంచం డబ్బులు తీసుకుంటుండగా అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు దాడులు చేసి ఏవోని పట్టుకుని కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని నాంపల...