విద్యుత్ ఉద్యోగలు ఛలో విద్యుత్ సౌధ
డిమాండ్ల సాధన కోసం ఆందోళన
ఖైరాతాబాద్ చౌరస్తాలో నిలిచిన ట్రాఫిక్
వరంగల్ వాయిస్,హైదరాబాద్: విద్యుత్ సౌధ ముందు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ మహాధర్నాకు దిగారు. ధర్నాలో 30వేల మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. పీఆర్సీతో పాటు 29 డిమాండ్లను పరిష్కరించాలంటూ ధర్నాకు దిగారు. ఈ క్రమంలోనే ఖైరతాబాద్, పంజాగుట్ట మార్గం మూసివేశారు. దీంతో 4 కిలోవిూటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు వెల్లువెత్తాయి. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఇచ్చిన ’ఛలో విద్యుత్ సౌధ’ పిలుపునకు ఉద్యోగుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులంతా ఆందోళనలో పాల్గొన్నారు. ఇసుకేస్తే రాలనంతగా విద్యుత్ సౌధ ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. స్టాండిరగ్ ఆర్డర్స్ రద్దు చేయాలని, వేతన సవరణ, ఆర్జిజన్ సమస్యలు, ఈపీఎఫ్ స్థాన...