అపరిచితులతో సమాచారం పంచుకోవద్దు..
బ్యాంకుల్లోని డబ్బులు దోచేస్తారు..వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషివిష్ణుప్రియ గార్డెన్స్ లో విద్యార్థులకు అవగాహన సదస్సు
వరంగల్ వాయిస్, క్రైం: వివిధ సామాజిక మాద్యమాల్లో పరిచయమయ్యే అపరిచత వ్యక్తులతో వ్యక్తిగత సమాచారన్ని పంచుకోవద్దని యువతకు వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి దిశా నిర్దేశం చేశారు. హనుమకొండ డివిజినల్ పోలీసుల అధ్వర్యంలో సైబర్ క్రైమ్స్, రోడ్డు సేఫ్టీ , మత్తు పదార్థాలపై కళాశాల విధ్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక హంటర్ రోడ్ లోని విష్ణు ప్రియ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.. ప్రస్తుత రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగం రోజు, రోజుకి అధికం కావడంతో పాటు, అదే స్థాయిలో ఇంటర్ నెట్ ను వినియోగించుకోని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూ, ప్రజల డబ్బును దోచేస్తున్నారన్నారు. ఇందుకు ముఖ్య కారణం నెట్ వి...