శుక్రవారం డ్రై డే విధానం పాటించాలి
డీఎంహెచ్ఓ డాక్టర్ కళావతి బాయి
వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది, స్టానిక గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి ప్రజలకు ప్రతి శుక్రవారం డ్రై డే విధానం పాటించేలా అవగాహన కలిగించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. కళావతి బాయి అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ మండలంలోని మల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, గ్రామాన్ని డీఎంహెచ్ఓ కళావతి బాయి సందర్శించారు. ఈ సందర్బంగా అధికారి మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది తప్పనిసరిగా ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాలు నిర్వహించాలని, స్టానిక గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి మురుగు గుంతలను పూడ్చివేయాలని, నీరు ఎక్కువగా నిల్వవున్న కుంటలలో ఆయిల్ బాల్స్ కానీ, కిరసనాయిల్ వేయాలన్నారు. కొబ్బరి బొండాలు, పాడై పోయిన టైర్లు, మొదలగువాటిని ఇంటి చుట్టూ ప్రక్కల ఉంచకుండా చూడాలఅన్నా...