సాంకేతిక ప్రపంచంలో దూసుకెళ్లండి
ఆత్మన్యూనతా భావాన్ని విడనాడాలి..
ఎలాంటి ఆకర్షణలకు లోను కావొద్దు..
లక్ష్యాన్ని ప్రేమించి నిరంతరం శ్రమించాలి
కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి..
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి
ఆర్జీయూకేటీ బాసరలో విద్యార్థులకు ఉద్బోధ
ప్రస్తుత సాంకేతిక యుగంలో తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదని, నిరంతరం శ్రమించిన వాడే విజేత అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ప్రేరణ కలిగించారు. శనివారం ఆర్జీయూకేటీ బాసరలో ‘ఇంజినీరింగ్ విద్య, నైపుణ్యం – భవిష్యత్తు’ అనే అంశంపై విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. తన జీవితంలో జరిగిన ఘటనలను ఉదహరిస్తూ.. విద్యార్థులకు స్ఫూర్తివంతమైన ప్రసంగం చేశారు. పేద విద్యార్థులు కుటుంబ పరిస్థితులను తలుచుకుని కుమిలిపోవద్దని, లక్ష్యాన్ని ప్రేమించి కసితో, పట్టుదలతో చదివి గెలుపు బావుటా ఎగురవేయాలని సూచించారు. ప్రస్తుత సాంకేతిక యుగంలో ప్రతీ ఇంజినీరింగ్ విద్యార్థి ఒక సృష్టికర్త, ఒక ఆవిష్...
