Warangalvoice

Tag: Distribution of buttermilk to one lakh people

లక్ష మందికి మజ్జిగ పంపిణీ
Top Stories, Warangal

లక్ష మందికి మజ్జిగ పంపిణీ

వరంగల్ వాయిస్, వరంగల్ : వరంగల్ జిల్లాలోని ఆర్యవైశ్య మిత్రబృందం ఆధ్వర్యంలో మేదరి వాడ కార్యాలయం ముందు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆర్యవైశ్య మిత్ర బృందం అధ్యక్షుడు దుబ్బ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్యవైశ్య మిత్రబృందం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం మజ్జిగ, అన్నదానం, ఉప్మా, అరటిపండు, స్వీట్స్ పంపిణీ కార్యక్రమం 60 రోజులు 85 మంది దాతలు 2,700 కిలోల మజ్జిగ పెరుగు, ఆరువేల లీటర్ల వాటర్, మూడు క్వింటాల అన్న వితరణ వీటన్నిటిని సుమారు 60 రోజుల్లో లక్ష మందికి పంపిణీ చేయడం గర్వకారణమన్నారు. సుమారు రెండు నెలపాటు నగరంలో ఉండే ప్రముఖులు, వైశ్యులు వారి వారి పుట్టినరోజులు, పెళ్లిరోజు, అదేవిధంగా జ్ఞాపకార్థం గుర్తు చేస్తూ పంపిణీ కార్యక్రమం చేపట్టిన సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా కష్టపడి పనిచేసిన ఆర్యవైశ్య మిత్రబృందం నాయకత్వాన్ని సన్మానించారు. ఈ కార్...