Warangalvoice

Tag: Dhasyam Vinay Bhaskar Open Public park in Hanamkonda

ప్రజల ఆహ్లాదానికే పార్క్ ల ఏర్పాటు
District News, Hanamkonda

ప్రజల ఆహ్లాదానికే పార్క్ ల ఏర్పాటు

ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ న్యూ మిలినియం బ్యాంక్ కాలనీలో పార్క్ ప్రారంభం వరంగల వాయిస్, హనుమకొండ టౌన్: ప్రజలకు ఆహ్లాదాన్ని అందించడానికి పార్క్ లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. శుక్రవారం బల్దియా పరిధి 49 వ డివిజన్ పరిధి న్యూ మిలినియం బ్యాంక్ కాలనీలో నూతనంగా అమృత్, సాధారణ నిధులు రూ.112.80 లక్షల అంచనా వ్యయం తో నిర్మించిన పార్క్ ను కమిషనర్ ప్రావీణ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ.. నగర ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడానికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశం మేరకు పశ్చిమ నియోజక వర్గంలో ఖాళీ ప్రాంతాలు,లే ఔట్ లను పరిరక్షించడంతో పాటు స్థానిక ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడానికి ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నూతనంగా ఏర్పడ్డ పార్కులో ఓపెన్ జిమ్ లు, వాకింగ్ ట్...