HCU | వెనక్కి తగ్గిన సర్కారు.. హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులు వాపస్
హెచ్‌సీయూ నుంచి పోలీసు బలగాల ఉపసంహరణ
మంత్రుల సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయం
వీసీకి డిప్యూటీ సీఎం భట్టి లేఖ
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటానికి ప్రభుత్వం దిగివచ్చింది. హెచ్‌సీయూ క్యాంపస్ నుంచి పోలీసు బలగాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. విద్యార్థులపై నమోదు చేసిన కేసులను కూడా ఉపసంహరించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు హెచ్‌సీయూ వీసీ బీజేరావు కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార సోమవారం లేఖ రాశారు. హెచ్‌సీయూలోని కంచ గచ్చిబౌలి భూ సమస్యపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన మంత్రుల సబ్ కమిటీ సోమవారం సచివాలయంలో సమావేశమైంది. సబ్‌కమిటీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార అధ్యక్షతన జరిగిన సమావేశానికి కమిటీ సభ్యు లు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవ...