Warangalvoice

Tag: Cordon search under Central Zone DCP Sheikh Salima

సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్
Crime, District News

సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్

వరంగల్ వాయిస్, కేయూ : కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డి పురం భగత్‌సింగ్‌నగర్ లో మంగళవారం సాయంత్రం సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా మాట్లాడుతూ అక్రమ మద్యం, గంజాయి,గుట్కా, హెల్మెట్ ధరించడం , సీసీ కెమెరాల ప్రాముఖ్యత, 1930 సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ వినియోగం పై కాలనీ ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో 20 ద్విచక్ర వాహనాలు, రెండు వేల రూపాయల గుట్కా స్వాధీనం చేసుకున్నారు.అనంతరం హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి కాలనీ పిల్లలకు బిస్కెట్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు.ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో హనుమకొండ,కేయూసి ఇన్స్పెక్టర్ లు సతీష్,రవికుమార్, 7 మంది ఎస్‌ఐలు, 60 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.     under Central Zone DCP Sheikh Salima...