TG Assembly: దళిత స్పీకర్‌పై జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు..
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో స్పీకర్ గడ్డం ప్రసాద్ మనస్తాపం చెందారు. దీంతో జగదీష్ రెడ్డి బే షరతుగా సభాపతికి క్షమాపణ చెప్పాలని మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. స్పీకర్‌పై ఇంత అహంకారంగా మాట్లాడటం తాను ఎప్పుడూ చూడలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్: బీఆర్ఎస్ నేత (BRS Leader), మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అసెంబ్లీ లో చేసిన వ్యాఖ్యల పట్ల స్పీకర్ గడ్డం ప్రసాద్ మనస్తాపం చెందారు. ఈ క్రమంలో మంత్రులు సభాపతితో భేటి అయ్యారు. జగదీష్ రెడ్డి వ్యవహారంపై స్పీకర్‌తో చర్చిస్తున్నారు. జగదీష్ రెడ్డి బే షరతుగా క్షమాపణ చెప్పాలని అందరూ డిమాండ్ చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. దళిత స్పీకర్‌పై జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు. స్పీకర్‌పై ఇంత అహంకారంగా మాట్లాడటం తాను ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రజ...