ప్రతిభావంతులకు అండ.. ‘చిట్ల’ మోరియల్ ట్రస్ట్
సామాజిక సేవే లక్ష్యంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పార్థసారథిఅమ్మనాన్నల స్ఫూర్తితో పుట్టిన ఆలోచన..పుట్టిన ఊరికి ఏదైనా చేయాలన్న తపనపేద విద్యార్థులకు భరోసాగా ట్రస్ట్ ఏర్పాటువిద్యా స్ఫూర్తిగా సాగుతున్న బృహత్తర కార్యక్రమం
‘‘పేదరికం ఎంతో కఠినమైనదో తెలుసు.. దాని ఫలితాలు మనిషి జీవితంపై ఎంత ప్రభావం చూపుతాయో తెలుసు.. పేదరికంపై విజయం సాధించాలంటే సగటు జీవికి చదువు ఒక్కటే ఏకైక ఆయుధం.. చిన్నతనంలో అమ్మనాన్న పడిన కష్టమే తనను ఉన్నత శిఖరాలు అధిరోహింపజేసేలా చేసింది..’’ ఈ మాటలు రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి చిట్ల పార్థసారథి హృదయాంతరాల్లోనుంచి వచ్చినవి. అమ్మనాన్నల స్ఫూర్తితో పుట్టిన ఊరి రుణం తీర్చుకోవడానికి చిట్ల ప్రమీల - జీవన్ రాజ్ మెమోరియల్ ట్రస్ట్ ను ఆయన 2008వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతీ యేడాది పేద ప్రతిభావంతులకు ప్రోత్సాహంగా నగదు పురస్కా...
