నిరంతర సాధనే – విజయమార్గం
ప్రణాళికతో చదివి విజేతగా నిలువండిపట్టుదలతో ఇష్టపడి చదవాలిచదువుతోనే ఉజ్వల భవిష్యత్తురాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథికామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉద్యోగార్థులకు అవగాహన సదస్సు
‘‘సిలబస్ పై పట్టు.. ప్రామాణిక పుస్తకాల అధ్యయనం.. నిరంతర సాధన..’’ ఇవే పోటీపరీక్షల్లో విజేతగా నిలువడానికి విజయ సూత్రాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి ఉద్బోధించారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోటీపరీక్షలపై ఉద్యోగార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మార్గనిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ.. పక్కా ప్రణాళికతో చదవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సమయాన్ని వృథా చేసుకోవద్దన్నారు. ప్రతీ నిమిషం కీలకమేనని, సోషల్ మీడియాకు దూరంగా ఉంటేనే విజయానికి దగ్గరవుతారని సూచించారు. అంకిత భావంతో చదివి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని అభ్యర్థులను ఉత్సాహపరిచారు.
వ...