Ministry Expand | నిరాశలో.. ఆశావహులు
ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణ
ఉలుకూ..పలుకూ లేని ప్రభుత్వం
ఏడాదైనా కనికరించని కాంగ్రెస్ అధిష్ఠానం
కొత్త ఏడాదిలోనూ తప్పని ఎదురు చూపులు
రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ మూడు అడుగులు ముందుకు, ఆరడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. ప్రజా పాలన పేరుతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ సంవత్సరం పూర్తయినా మంత్రి వర్గ విస్తరణ చేపట్టకపోవడంతో ఆశావహుల్లో ఆందోళన నెలకొంటోంది. కీలకమైన శాఖలన్నీ సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉండటంతో పాలన పడకేసింది. గత కొన్ని నెలలుగా విస్తరణపై ఊహాగానాలు కొనసాగుతున్నా అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. డిసెంబర్ చివరిలోగా విస్తరణ జరుగుతుందంటూ మంత్రులు సైతం ప్రకటనలు చేసినా కార్యరూపం దాల్చలేదు. అయితే విస్తరణకు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉండటం, ఈ నెల మూడో వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం విదేశీ ...