కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆ పార్టీ ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి
Congress MLA | కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడుతున్నవారికి సరైన ప్రాధాన్యం ఇవ్వడంలేదని అన్నారు. నిన్నమొన్న పార్టీలో చేరినవాళ్లకు పదవులు కట్టబెట్టి అందలం ఎక్కించడం ఏమాత్రం సబబుకాదని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడుతున్నవారికి సరైన ప్రాధాన్యం ఇవ్వడంలేదని అన్నారు. నిన్నమొన్న పార్టీలో చేరినవాళ్లకు పదవులు కట్టబెట్టి అందలం ఎక్కించడం ఏమాత్రం సబబుకాదని వ్యాఖ్యానించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఈ విధంగా పార్టీ తీరుపై అసంతృప్తి గళం వినిపించారు.
తెలంగాణ మంత్రివర్గంలో రంగారెడ్డి జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న జిల్లా రంగ...