KTR | ఫార్ములా ఈ కేసులో మళ్లీ నాకు నోటీసులు పంపిస్తారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR | తెలంగాణలో కచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలిపారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ సోమవారం నాడు నామినేషన్ వేశారు.
KTR | తెలంగాణలో కచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలిపారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ సోమవారం నాడు నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తమకు ఉన్న బలంతోనే ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేస్తున్నామని తెలిపారు.
అప్పుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పదేపదే అబద్ధాలు చెబుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఇంకా ఎన్నేళ్లు అబద్ధాలు చెబుతారని రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాల తీరు కూడా అబద్ధాలు, బుకాయింపులత...