హామీలు అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
వరంగల్ వాయిస్, హనుమకొండ : భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని న్యాయవాదుల సంఘం గ్రాడ్యుయేట్స్ కు విజ్ఞప్తి చేస్తుందని న్యాయవాదుల సంఘం రాష్ట్ర నాయకులు, భారత రాష్ట్ర సమితి, రాష్ట్ర సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, బీఆర్ఎస్ లీగల్ సేల్ అధ్యక్షుడు గుర్రాల వినోద్ కుమార్, జనరల్ సెక్రెటరీ శివరాజ్ కుమార్ ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 34 నియోజకవర్గాల్లో పట్టభద్రులు ఆచితూచి ఎంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఆరు నెలలలో ప్రజల వ్యతిరేకతను చూరగొందని ఈ సందర్భంగా తెలిపారు. రేవంత్ ప్రభుత్వంలో అందరికీ అన్యాయం జరుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో కేంద్ర పార్టీలైన కాంగ్రెస్ ప...