కమ్యూనిస్టులే దేశానికి ప్రత్యామ్నాయం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కళ్లపల్లి
వరంగల్ వాయిస్, జఫర్ గడ్ : కమ్యూనిస్టులే దేశానికి సరైన ప్రత్యామ్నాయం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు అన్నారు. గురువారం జఫర్ గడ్ మండల కేంద్రంలో జనగామ జిల్లా పార్టీ రాజకీయ శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరగనున్న ఈ శిక్షణా తరగతులలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు, మండల కార్యదర్శులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన శిక్షణా తరగతుల ప్రారంభ సమావేశానికి సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆది సాయన్న అధ్యక్షత వహించగా తక్కళ్లపల్లి శ్రీనివాస రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వామపక్షాల బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. కులం, మతం పేరుతో రాజకీయ లబ్ధి పొందాలని చూసే పార్టీలకు కాలం చెల్లిందన్నారు. లౌకిక దేశమైన భారత దేశంలో మత రాజకీయాలు, మతోన్మాద శక...
