Revanth Reddy | వీకెండ్ రాజకీయాలు చేయొద్దు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకిన సీఎం రేవంత్ రెడ్డి
ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు. మంత్రి పదవులను అధిష్ఠానం చూసుకుంటుందని తెలిపారు. పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలను హెచ్చరించారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తనకు మంత్రి పదవి రాకుండా జానా రెడ్డి అడ్డుకుంటున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రచ్చ చేస్తే.. పదేళ్లు పార్టీని కాపాడుకున్న మమ్మల్ని కాదని.. వేరే పార్టీలు తిరిగొచ్చిన వారికి పదవులు ఇస్తారా అని ప్రేమ్‌సాగర్ రావు పరోక్షంగా ప్రభుత్వానికే వార్నింగ్ ఇచ్చారు. ఇలా ఒక్కొక్కరుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు. మంత్రి ప...