CM Revanth Reddy | సీఎం ఎక్కిన లిఫ్ట్‌లో స్వల్ప అంతరాయం.. రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం..
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ఎక్కిన లిఫ్ట్‌లో స్వల్ప అంతరాయం ఏర్పడింది. దీంతో సీఎం సెక్యూరిటీ సిబ్బంది, మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన హైదరాబాద్ శివారు శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
శంషాబాద్ నోవాటెల్ హాటల్‌లో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. మొదటి అంతస్తు నుంచి రెండో అంతస్తులోకి వెళ్లేందుకు సీఎం రేవంత్ లిఫ్ట్ ఎక్కారు. అయితే పరిమితికి మించి ఆ లిఫ్ట్‌లో ఎక్కడంతో అది ఒక్కసారిగా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో హోటల్ సిబ్బంది, సీఎం సెక్యూరిటీ అప్రమత్తమయ్యారు. సెక్యూరిటీ సిబ్బంది లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసి వేరే లిఫ్ట్‌లో రేవంత్ రెడ్డిని సెకండ్ ఫ్లోర్‌కి పంపారు.
రేవంత్ ఉక్కిర...