CM Revanth Reddy: ఆపరేషన్ సిందూర్.. పోలీసులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు
వరంగల్ వాయిస్, హైదరాబాద్: దేశ సైన్యంతో మనమంతా అండగా ఉన్నామనే సందేశం ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ సమయంలో రాజకీయాలు, పార్టీలకు తావులేదని స్పష్టం చేశారు. అత్యవసర సర్వీస్‌లు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఉద్యోగులు అంతా ప్రభుత్వానికి అందుబాటులో ఉండాలని చెప్పారు. మంత్రులు, అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఇవాళ(బుధవారం) ఉదయం 11 గంటలకు ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఆపరేషన్ సిందూర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్, డీజీపీలతో పాటు అందుబాటులో ఉన్న మిలిటరీ అధికారులు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల రక్షణకు సంబంధించి అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.
విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స...