CM Revanth Reddy: కులగణనపై బీఆర్ఎస్, బీజేపీ కుట్ర. సీఎం రేవంత్‌రెడ్డి పైర్
CM Revanth Reddy: బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కులగణనలో ఇప్పటి వరకు వారి వివరాలు ఎందుకు నమోదు చేసుకోలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. 50శాతం ఉన్న ప్రజలు, అర శాతం ఉన్న వాళ్లను ప్రశ్నిస్తారని వాళ్లకు భయపట్టుకుందని విమర్శించారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్: కులగణన ప్రక్రియ నిర్వీర్యం చేసేలా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుట్ర పన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేశారు. కులగణనపై కోర్టుల్లో కేసులు వేసే ప్రమాదం ఉందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మాటిచ్చారని తెలిపారు. బలహీన వర్గాలు ముందుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని చెప్పారు. మా నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలని బీసీ కులగణన చేశామని తెలిపారు. ఇవాళ(శనివారం) గాంధీభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం...