Revanth criticizes KCR family: కేసీఆర్ ఫ్యామిలీపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన సీఎం రేవంత్
Revanth criticizes KCR family: 1,532 మందికి లెక్చరర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 50 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామని తెలిపారు. దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని గ్రహించాలన్నారు. 55 రోజుల్లోనే 11 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశామన్నారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : రవీంద్రభారతిలో జూనియర్ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్ల ఉద్యోగాలకు ఎంపికైన 1,532 మందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth reddy) ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. 1292 జూనియర్ లెక్చరర్స్, 240 పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టులకు నియామక పత్రాలు పంపిణీ చేశారు సీఎం. ఈ సందర్భంగా నూతనంగా ఉద్యోగ బాధ్యతలు చేపడుతున్న వారికి సీఎం అభినందలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాటల ప్రకారం 57,946 ఉద్యోగ నియామకాలు చేపట్టామని గర్వంగా చెబుతున్నామన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర...