CM Revanth Reddy: హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయి.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: భవిష్యత్తు ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వ సహకారంతో మైక్రోసాఫ్ట్ ఏఐ సెంటర్ ఏర్పాటు చేస్తుందని గర్వంగా చెబుతున్నానని అన్నారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో మరో కొత్త మైక్రోసాఫ్ట్ ఫెసిలిటీని ప్రారంభించుకోవడం మనందరికీ గర్వకారణంగా ఉందని తెలిపారు. హైదరాబాద్ జర్నీలో ఇదొక మైలురాయి అని చెప్పారు. మైక్రోసాఫ్ట్, హైదరాబాద్ మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం ఉందని అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ విస్తరణలో భాగంగా నూతన భవనాన్ని ఇవాళ (గురువారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... హైదరాబాద్‌లో ఏఐ సెంటర్ ఏర...