కార్మిక వర్గం హక్కులను కాపాడేదే సీఐటీయూ
ముక్కెర రామస్వామి జిల్లా కార్యదర్శి
వరంగల్ వాయిస్, వరంగల్ : సీఐటీయూ 54 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరీమాబాదు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో నూతన జెండాను సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ సీఐటీయూ ఆవిర్భవించి నేటికి 54 సంవత్సరాలు అవుతుందన్నారు. ఐక్యత పోరాటం అనే నినాదాన్ని ఐదు దశాబ్దాల నుంచి ఆచరణలో పెట్టడానికి తీవ్రమైన ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. ముఖ్యమైన నినాదాన్ని ఆచరణలో అమలు చేసేందుకు అవిశ్రాంతంగా సీఐటీయూ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందన్నారు. దేశంలోనే ట్రేడ్ యూనియన్ ఉద్యమం ప్రారంభంలో సీఐటీయూ ఒంటరి అయినప్పటికీ ప్రయత్నాలు అధిగమించడమే కాకుండా నేడు కార్మిక వర్గానికి కాపాడడం, ఐక్య ఉద్యమాలను అభివృద్ధి చేయడంలో, కార్మిక వర్గం హక్కులు, వేతనాలు, ప్రయోజనాలను, పని పరిస్థితులను మెరుగుపరచడంలో ఛాంపియన్ గా సీఐటీయూ ముందు నిలిచి...