Warangalvoice

Tag: Chennarayaopeta society meeting

సహకార సంఘానికి రైతులే వెన్నెముకలు… 
District News, Warangal

సహకార సంఘానికి రైతులే వెన్నెముకలు… 

-సొసైటీ అధ్యక్షుడు ముద్దసాని సత్యనారాయణ రెడ్డి వరంగల్ వాయిస్, చెన్నారావుపేట : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 67వ వార్షిక మహాసభ సొసైటీ అధ్యక్షుడు ముద్దసాని సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. అనంతరం సీఈఓ రవి నివేదిక చదివి వినిపించాడు. కొందరు రైతులు నివేదికలో ఉన్నవి అన్ని తప్పులే అని వాపోయారు. అనంతరం సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ త్వరలో రైతులకు కొత్త రుణాలు అందజేస్తామని తెలిపారు. ఈ వార్షిక మహాసభలో సొసైటీ మాజీ వైస్ చైర్మన్ తొగరు చిన్నారెడ్డి మాట్లాడుతూ జల్లి గ్రామంలో గోదాం నిర్మించాలని దానికి రోడ్డు కోసం ఆరు గుంటల భూమిని ఇస్తున్నట్లు మహాసభ తెల్ల కాగితంపై సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు....