Warangalvoice

Tag: Change notices to Bandi Sanjay

బండి సంజయ్‌కు మారోమారు నోటీసులు
Telangana, Top Stories

బండి సంజయ్‌కు మారోమారు నోటీసులు

లీగల్‌గా చర్చిస్తామన్న బండి సంజయ్‌ వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: బండి సంజయ్‌కు మరోసారి సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇంటికి శనివారం ఉదయం సిట్‌ అధికారులు చేరుకున్నారు. ఆదివారం విచారణకు హాజరు కావాలని సిట్‌ ఆదేశాలు జారీ చేసింది. అయితే సిట్‌ నోటీసులపై స్పందించిన బండి సంజయ్‌.. విచారణకు హాజరుకావాలా.. లేదా అనే అంశంపై తమ లీగల్‌ టీంతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు. సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలనే డిమాండ్‌ కు కట్టుబడి ఉన్నానని తెలిపారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీక్‌ కేసులో నమ్మలేని నిజాలున్నాయన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు మూడు రోజుల క్రితం కూడా సిట్‌ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న తమ ఎదుట హాజరై వివరాలు అందించాలని నోటీసుల్లో పేర్కొంది. బండి సంజయ్‌ తన నివాసంలో లేకపోవడంతో అక్కడే నోటీసులను అధికారులు అతికించారు. గ్రూప్‌`1లో బీఆర్‌ఎస్‌ నేతల పి...