chahath bajpai – చాలెంజింగ్ ఆఫీసర్.. చాహత్ బాజ్ పాయ్
ఆకస్మిక తనిఖీలతో హల్ చల్
అక్రమార్కులపై ఉక్కుపాదం
పాలనలో పట్టు భిగిస్తున్న ఐఏఎస్
గ్రేటర్ కమిషనర్ గా తనదైన ముద్ర
మరో శాలినీమిశ్రా అంటూ కితాబు
గ్రేటర్ వరంగల్ కు ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు.. పోతుంటారు. అందులో కొందరు మాత్రమే నగర ప్రజల గుండెల్లో కొలువై ఉంటారు. నగరాభివృద్ధిలో వారి మార్క్ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అలాంటి వారిలో ప్రముఖంగా చెప్పుకునే పేరు శాలినీ మిశ్రా అయితే అదే స్థాయిలో అధికారులను పరుగులు పెట్టిస్తూ పాలనను చక్కదిద్దే పనిలో పడ్డారు ప్రస్తుత కమిషనర్ చాహత్ బాజ్ పాయ్. 13 జూన్ 2025న విధుల్లో చేరిన కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ గ్రేటర్ పరిధిలోని అన్ని రంగాలపై పట్టు సాధిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. పడకేసిన స్మార్ట్ సిటీ, హృదయ్, అమృత్ పథకాలను గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టారు. శానిటేషన్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారికి...