పోలవరంపై కేంద్రం కప్పదాటు వ్యవహారం
గట్టిగా నిలదీయడంలో జగన్ ప్రభుత్వం విఫలం
విభజన జరిగి 9 ఏళ్లు కావస్తున్న కదలని ప్రాజెక్ట్
నిర్వాసితుల విషయంలో కేంద్ర, రాష్టాల్ర దోబూచులాట
వరంగల్ వాయిస్,అమరావతి:పోలవరానికి కేంద్రం కల్పిస్తున్న అడ్డంకులపై నిలదీసి పోరాడడంలో వైసిపి ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు ఉన్నాయి. పోలవరంపై చంద్రబాబుపై విమర్శలకే మంత్రులు, సిఎం జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాకాకుండా కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారు. దీంతో విభజన జరిగి 9 ఏళ్లు కావస్తున్నా పోలవరం పూర్తి కాలేదు. నిర్వాసితులకు పరిహారం దక్కలేదు. నిధులు సాధించి సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అంటిముట్టనట్లుంటోంది. కేంద్రం వద్దకెళ్లి నిధులను డుగుతున్నాం అని చెపుతున్నా..ప్రగతి మాత్రం కనిపించడం లేదు. ఇటీవల అసెంబ్లీ సాక్షిగా చేసిన పనులకు రూ.2,600 కోట్లు కేంద్రం చెల్లించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెల్లడిరచగ...
