KTR | పీఆర్సీ, డీఏలు అడిగితే.. ప్రభుత్వ ఉద్యోగులను విలన్లుగా చిత్రీకరిస్తారా..? రేవంత్ రెడ్డిపై మండిపడ్డ కేటీఆర్
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ, డీఏలు అడిగితే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ప్రజలను ముందు విలన్లుగా చిత్రీకరిస్తారా..? అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని అడిగిన ఉద్యోగులపై రేవంత్ రెడ్డి నోరుపారేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ ఏ ఒక్క హామీ ఇప్పటి వరకు నెరవేరలేదు. తెలంగాణ కోసం వారు చేసిన త్యాగం గురించి రేవంత్ రెడ్డికి ఇసుమంతైనా తెలియదు. ఫ్రీ జోన్ హైదరాబాద్ అని తీర్పు వస్తే తెలంగాణ ఉద్యోగులు తిరస్కరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఎన్జీవోలు ఎంతో గొప్ప ఉద్యమం చేశారు అని కేటీ...
