KTR | ఏడాది పాటు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు చేస్తాం : కేటీఆర్
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : తెలుగునాట విజయవంతంగా 25 ఏండ్లు పూర్తి చేసుకున్న రెండు పార్టీలు బీఆర్ఎస్, టీడీపీ మాత్రమే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అందుకే ఏడాది పాటు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు.
వరంగల్ ఎల్కతుర్తిలో ఎలాంటి ట్రాఫిక్ లేకుండా.. ప్రజలకు ఇబ్బంది కాని ప్రాంతంలో సభ నిర్వహణ జరుగుతుంది. 1200 ఎకరాల్లో పార్కింగ్‌తో పాటు సభ ఏర్పాట్లు అన్ని ఘనంగా జరుగుతున్నాయి. ఆర్టీసీ ద్వారా 3000 బస్సుల కోసం విజ్ఞప్తి చేశాను.. ఆర్టీసీ సూత్రప్రాయంగా అంగీకరించింది. 27వ తేదీ ఆదివారం కావడం విద్యార్థులకు సెలవులు ఉండటం ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగవు అని కేటీఆర్ పేర్కొన్నారు.
మా పార్టీ చరిత్రలో ఈ సమావేశం ఒక పెద్ద మీటింగ్ అవుతుంది. బహిరంగ సభ తర్వాత విద్యార్థి , కార్యకర్తల సభ్యత్వ నమోద...