KTR | ప్రజాస్వామ్యం మందబలం ఆధారంగా నడవరాదు : కేటీఆర్
KTR | డీ లిమిటేషన్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యం మందబలం ఆధారంగా నడవరాదు అని పేర్కొన్నారు.
వరంగల్ వాయిస్, చెన్నై : డీ లిమిటేషన్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యం మందబలం ఆధారంగా నడవరాదు అని పేర్కొన్నారు. చెన్నైలో జరిగిన దక్షిణ భారతదేశ రాష్ట్రాల పార్టీల సమావేశానికి కేటీఆర్ హాజరై మాట్లాడారు.
కేసీఆర్ ఆధ్వర్యంలో 14 ఏండ్ల పాటు తెలంగాణ ఉద్యమం నడిపించారు. 14 సంవత్సరాల అనంతరం తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చుకున్నాం. తమిళనాడు ప్రజల నుంచి అనేక అంశాలు స్ఫూర్తి తీసుకుంటాం. అస్తిత్వం, హక్కుల కోసం కొట్లాడడంలో తమిళనాడు స్ఫూర్తినిచ్చింది. ద్రవిడ ఉద్యమం సమైక్య దేశంలో తమ హక్కులు సాధించడానికి రాష్ట్రాలకు ఒక దిక్సూచీ లెక్క పని చేస్తుందన్నారు కేటీఆర్.
డీ లిమిటేషన్ వల్ల అనేక నష్టాలు...