KTR | ఉప్పు – నిప్పులాగా కొట్లాడుకుంటాం.. కానీ చెన్నైలో సీఎంను గౌరవించాను : కేటీఆర్
రాష్ట్రంలో ఉప్పు - నిప్పులాగా కొట్లాడుకుంటాం.. కానీ చెన్నైలో సీఎం రేవంత్ రెడ్డిని గౌరవించానని, అది నా సంస్కారం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : రాష్ట్రంలో ఉప్పు – నిప్పులాగా కొట్లాడుకుంటాం.. కానీ చెన్నైలో సీఎం రేవంత్ రెడ్డిని గౌరవించానని, అది నా సంస్కారం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. శాసనసభలో కేటీఆర్ మాట్లాడారు.
రేవంత్ రెడ్డి గారికి ఒక్కటి చెప్పదలచుకున్నా.. మీరు నేను చెన్నై మీటింగ్‌కు వెళ్లాం. అక్కడ మీరు ఒక ప్రతిపాదన పెట్టారు. నేను మీ పార్టీ వ్యక్తిని కాదు.. ఇక్కడ ఉప్పు నిప్పులాగా కొట్లాడుకుంటాం.. కానీ నేను మిమ్మల్ని గౌరవించి.. మా సీఎం చెప్పిన మాట కరెక్ట్ అని 33 శాతం కాదు 36 శాతం ఇవ్వొచ్చని చెప్పాను. ఎందుకంటే నాకు ఆ సంస్కారం ఉంది. ఎందుకంటే నీవు...