KTR | వానపాములు కూడా నాగుపాముల్లా బుస కొడుతున్నాయి.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ సెటైర్లు
KTR | రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భూమికి మూడు ఫీట్లు ఉన్నోడు కూడా అసెంబ్లీలో చాలాచాలా మాట్లాడుతున్నాడని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.
వరంగల్ వాయిస్, సూర్యాపేట : రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భూమికి మూడు ఫీట్లు ఉన్నోడు కూడా అసెంబ్లీలో చాలాచాలా మాట్లాడుతున్నాడని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. సూర్యాపేటలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
రేవంత్ రెడ్డి ఒక రాజకీయ పిగ్మి. కేసీఆర్ మోకాలి ఎత్తుకు సరిపోనోడు కూడా ఆహో ఓహో అని గర్జిస్తున్నాడు. గ్రామ సింహాలు కూడా సింహాల్లాగా ఎగురుతున్నాయి. వానపాములు కూడా నాగుపాముల్లాగా బుస కొడుతున్నాయి. అలాంటి పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. 2001లో గులాబీ...
