KTR | ప్రతి తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యం ఈ గులాబీ జెండానే : కేటీఆర్
KTR | ప్రతి తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యం ఈ గులాబీ జెండానే అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
వరంగల్ వాయిస్, సూర్యాపేట : ప్రతి తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యం ఈ గులాబీ జెండానే అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ రజోత్సవాల వేడుకల నేపథ్యంలో సూర్యాపేటలో ఏర్పాటు చేసిన పార్టీ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించిన సమయంలో కేసీఆర్‌కు మనీ పవర్ లేదు.. మజిల్ పవర్ లేదు.. కుల బలం లేదు.. ధన బలం లేదు.. మీడియా లేదు. ప్రతికూల శక్తులన్నీ హైదరాబాద్‌లో అడ్డా పెట్టి తొక్కి పారేస్తాం అని హుంకరింపులు. ఈరకమైన వాతావరణంలో ఒక్కడిగా బయల్దేరిన సమయంలో ఆయనకు కొందరు తోడుగా నిలిచారు. అలా ఒక్కొక్క అడుగేసుకుంటూ 14 ఏండ్ల శ్రమించి తెలంగాణను సాధించారు అని కేటీఆర్ తెలిపారు...