KTR | గడ్డి నరసయ్య మరణం పార్టీకి తీరని లోటు : కేటీఆర్
సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గడ్డి నరసయ్య మరణం పార్టీకి తీరని లోటు అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గడ్డి నరసయ్య మరణం పార్టీకి తీరని లోటు అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. నరసయ్య అకాల మరణం పట్ల చింతిస్తూ.. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ తరఫున వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను అని కేటీఆర్ తెలిపారు.
ఇక నరసయ్య మృతదేహానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య శుక్రవారం నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి భరోసా అందించారు. ఆయన వెంట బీఆర్ఎ...