KTR | చిన్నారి శ్రీవిద్య చదువుకు అండగా కేటీఆర్.. రెండేండ్ల ఫీజు చెల్లింపు
KTR | చిన్నారి శ్రీవిద్య మళ్లీ స్కూలు గడప తొక్కింది. తనకు ఎంతో ఇష్టమైన పుస్తకాలతో మళ్లీ స్నేహం చేస్తుంది. ఆమె కలలకు కేటీఆర్ రెక్కలు తొడగడంతో మళ్లీ బడిబాట పట్టింది.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : చిన్నారి శ్రీవిద్య మళ్లీ స్కూలు గడప తొక్కింది. తనకు ఎంతో ఇష్టమైన పుస్తకాలతో మళ్లీ స్నేహం చేస్తుంది. ఆమె కలలకు కేటీఆర్ రెక్కలు తొడగడంతో మళ్లీ బడిబాట పట్టింది. సరైన పత్రాలు లేకపోవడం హైదరాబాద్ సనత్ నగర్ దాసారం బస్తీకి చెందిన మల్లెల శ్రీవిద్య అడ్మిషన్‌ను స్కూల్ యాజమాన్యం రద్దు చేసింది. బాగా చదువుకోవాలని ఆశపడ్డ శ్రీవిద్యకు ఆధార్ రూపంలో ఎదురైన సమస్య గురించి పత్రికలో వచ్చిన వార్తకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
తన కార్యాలయ సిబ్బందిని శ్రీవిద్య ఇంటికి పంపించి తల్లిదండ్రులతో మాట్లాడించారు. ఆధార్, బర్త్ సర్టిఫికేట్ ఇప్పించడంలో సహాయం చేస్తామన్నారు. ఇంతేకాదు శ్రీవిద్య తల్లిదండ్రుల ఆర్థి...