KTR | ఆరు గ్యారెంటీలు గోవిందా.. గోవిందా.. కాంగ్రెస్ బడ్జెట్‌పై కేటీఆర్ ఫైర్
KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ధ్వజమెత్తారు. ఇవాళ శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కేటీఆర్ నిప్పులు చెరిగారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ధ్వజమెత్తారు. ఇవాళ శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కేటీఆర్ నిప్పులు చెరిగారు. బడుగు, బలహీన వర్గాలను మోసం చేసేలా ఈ బడ్జెట్ ఉందని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు ఆరు గ్యారెంటీల ఊసే లేదని కేటీఆర్ విరుచుకుపడ్డారు. శాసనసభ వాయిదా పడిన అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ రోజు రాష్ట్రంలోని పేదలు, రైతులు, ఆడబిడ్డలు అందరూ...
